ఓ మిత్రమా!
నా మనో నేత్ర ప్రతిబింబమా!
రేపన్నది మాపన్నది
తలపులకు చిక్కనిది అర్థంకానిది
దిగులుపడక ప్రతిక్షణం
పదుగురితో ఆనందాన్ని
పంచుకొంటూ పెంచుకొంటూ
కష్టాలను చిరునవ్వుతో
వదిలించుకొంటూ
అలుపెరగని బాటసారివై
జీవితాన్ని సాగించు.
విజయం నీదే మిత్రమా!
ఎల్లప్పుడూ!
- lsnbsquare
No comments:
Post a Comment