BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Saturday, December 18, 2010

Youth ICON: Sri Hanuman



శివ దేవుని అంశవు నీవు
ఆంజని దేవి మానస పుత్రుడవు
వాయుతేజోద్భవుడవు నీవు
బ్రహ్మ సూర్యాది మహా మహిమాన్విత దేవతా వర బలసంపన్నుడవు
సకల వేదశాస్త్ర పారంగతుడవు నీవు
సుగ్రీవుని ప్రాణ రక్షకుడవు రాజ్యసంరక్షకుడవు
ఆదికవి వాల్మీకి రామాయణ బ్రహ్మనందభరిత సౌందర్యము నీవు
శ్రీ సీతారాముల భక్తకోటిలో ప్రథముడవు
శ్రీ రామ దూతవు లక్ష్మణ ప్రాణదాతవు సోదరసమానుడవు నీవు
కలి బారి నుండి ఆకలిబాధ నుండి రక్షించే ఆపథ్భాందవుడవు
రాక్షసాధముల వినాశకారివి నీవు
యెన్నని పొగడను నీ శక్తి యుక్తుల నీ సద్గుణముల
శ్రీ హనుమాన్ చాలీసా విరచించిన శ్రీ తులసిదాసునకు
శ్రీరామ సాక్షాత్కరము కలిగించి మహోపకారము చేసిన కరుణాసముద్రుడవు
సదా నీ కృపా కటాక్షాలకై కృపాకటాక్ష వీక్షణాలకై
శత సహస్రాధిక సాష్టాంగ ప్రణామాలతో పాహిమాం!రక్షమాం! అని
వేడుకొంటున్నాడు మానవ మాత్రుడు సాయినాథుడు
నా అఙ్ఞానాన్ని పటాపంచలు చేయ
జాగుసేయక వేగిరముగ దయచేయవయ్యా ఓ హనుమయ్యా !

-LSNBSQUARE

****
Siva dEvuni amSavu neevu
Anjani dEvi maanasa putruDavu
vaayutEjOdbhavuDavu neevu
brahma sUryAdi mahA mahimAnvita dEvatA vara bala sampannuDavu
sakala vEda SAstra pAramgatuDavu neevu
sugreevuni prANa rakshakuDavu rAjya saMrakshakuDavu
Adikavi vAlmIki rAmAyaNa brahmananda bharita sowmdaryamu neevu
SrI sItA rAmula bhaktakOTi lO prathamuDavu
SrI rAma dUtavu lakshmaNa prANadAtavu sOdara samAnuDavu neevu
kali baari nunDi AkalibAdha nunDi rakshimchE aapathbhAndavuDavu
rAkshasAdhamula vinASakArivi neevu
yennani pogaDanu nee Sakti yuktula nee sadguNamula
SrI HanumAn chAlIsA virachinchina SrI tulasi dAsu naku
SrI rAma sAkshAtkaramu kaliginchi mahOpakAramu chEsina karuNAsamudruDavu
sadA nI kRpA kaTAkshAlakai kRpA kaTAksha veekshaNAlakai
Sata sahasrAdhika sAshTAnga praNAmA latO pAhimaam! rakshamAm ! ani
vEDukonTunnADu maanava mAtruDu sAyinAthuDu
naa a~m~nAnaanni paTApamchalu chEya
jAgusEyaka vEgiramuga dayachEyavayyA O hanumayyA !

(Many thanks to:
http://lekhini.org/
for providing Telugu font)

****
Jai Chiranjeeva Jagadeka Veera..!
Song dedicated to Sri Hanuman devotees.



Sung by 'Chiranjeevi' Bhuvana Kruthi.
Excellent Talli!!.You have awesome voice.GOD bless you.

Judges: Music directors Koti garu,Ramana Gogula garu &
Popular singer Smt.S.P.Sailaja garu(V.V.S SPB's sister)

Anchor:Indian Idol 2 N.C.Karunya

No comments:

Post a Comment