BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Monday, January 23, 2012

సంక్రాంతి sankrAMti



ఉత్తరాయణ పుణ్యకాల ఆగమనం సంక్రాంతి
సుందర సుమధుర పర్వదినం సుదినం సంక్రాంతి
భోగి పండుగ మలి పండుగ సంక్రాంతి
వేవేల వర్ణాల ముగ్గుల రంగవల్లుల రంగోళి సంక్రాంతి

****

హరిదాసు భక్తి గానామృత ధారలు
గంగిరెద్దులతో మేళతాళాల సందళ్లు
మామిడాకుల తోరణాలు-పువ్వులతో అందమైన అలంకారాలు
ధాన్యపు గాదుల కళకళలు-పెద్దల ఆనందాల పరవళ్ళు
చిన్నారుల చిరునవ్వుల మిలమిలలు
మహాలక్ష్మి దేవతా పూజలు నైవేద్యాలు
పొంగలి అరిసెల వంటి నోరూరించే అమ్మ చేతి వంటలు-తిన్న కడుపులో ఆనందాల పంటలు
-ఈ అన్నింటి మేళవింపు మా పండుగ సంక్రాంతి

****

పంజాబీల లోహడి
బెంగాలీల తిలప్రాసంక్రాంతి
మహారాష్ట్ర తిలసంక్రాంతి
తమిళనాడు పొంగల్
- అందరి పండుగ సంక్రాంతి

హరిలొ రంగ హరి
ప్రతి సంక్రాంతి తీసుకురావాలి మన భరతభూమికి మహోజ్జ్వల మహాభ్యుదయం

uttarAyaNa puNyakAla aagamanam samkrAnti
sundara sumadhura parva dinam sudinam samkrAnti
bhOgi pamDuga mali panDuga maa samkrAnti
vEvEla varNAla muggula rangavallula raMgOLi mana samkrAnti
haridAsu bhakti gAnAmRta dhAralu
gamgireddulatO mELatALAla sandaLlu
mAmiDAkula tOraNAlu-puvvulatO andamaina alaMkArAlu
dhAnyapu gAdula kaLakaLalu - peddala AnamdAla paravaLLu
chinnArula chirunavvula milamilalu
mahAlakshmi dEvatA pUjalu naivEdyAlu
pongali arisela vanTi nOrUrinchE amma chEti vanTalu - tinna kaDupulO AnaMdAla panTalu
-ee annimTi mELavimpu maa panDuga samkrAMti

****
panjAbeela lOhaDi
bengAleela tilaprAsankrAMti
mahArAshTra tilasamkrAMti
tamiLanADu pongal
- amdari panDuga samkrAMti

Harilo ranga hari
prati sankrAMti teesuku rAvAli mana bharatabhoomi ki mahOjjvala maHAbhyudayam

http://en.wikipedia.org/wiki/Makar_Sankranti

best wishes,
lsnbsquare-motherindia.

No comments:

Post a Comment