BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Saturday, May 7, 2011

మాతృదేవతా మూర్తి






భూమాతవలె బిడ్డడిని నవమాసములు మోస్తూ కంటికి రెప్పవలె కాపాడుకొనే దైవం
తన ప్రేమను పసికందుకి ప్రాణవాయువులా అందిచే దేవతా మూర్తి
ప్రతి శిశువు తన్మయత్వంతో అనుభవించే తొలిప్రేమ-
తన తల్లి అందించే అద్భుతమైన అమూల్యమైన ప్రేమ
అతిమధురమైన శుచికరమైనది అమ్మ చేతి వంట-
తిన్న బిడ్దల కడుపు అనందాల పంట
అత్యంత శక్తిమంతమైన దీవెన-
శ్రీరామరక్ష యనుచు దీవించె తల్లి దీవెన
అక్షరాభ్యాసము చేయించి విద్యాబుద్ధులు నేర్పే తొలిగురువు తల్లి
తన జీవితచక్రం లో యెన్నో కష్టములకోర్చి కన్నీటిని దిగమ్రింగి త్యాగాలకు వెనుకాడక
బిడ్ద శ్రేయస్సు కోసం ప్రతినిత్యం (ప్రార్థించే) శ్రమించే ప్రత్యక్ష దైవం
-మాతృదేవతా మూర్తి

****
ఓ నేస్తమా!
మరువకు యెన్నడూ
మాతృదేవోభవ అను ఆర్యోక్తిని.
నిన్ను కన్న తల్లిని భరతమాత ను
ప్రేమామృత సమ్మిళిత కమలములతో సదా పూజించు తరించు.

జై హింద్!

****

bhUmAta vale biDDaDini nava mAsamulu mOstU kanTiki reppavale kaapADukonE daivam
tana prEmanu pasikanduki prANavAyuvulA andichE dEvatA mUrti
prati SiSuvu tanmayatvam tO anubhavimchE toliprEma-
tana talli andimchE adButamaina amUlyamaina prEma
atimadhuramaina Suchikaramaina di amma chEti vanTa-
tinna biDdala kaDupu anamdAla panTa
atyanta Saktimantamaina deevena-
Sree rAma raksha yanuchu deevimche talli deevena
aksharAbhyAsamu chEyimchi vidyAbuddhulu nErpE toliguruvu talli
tana jeevita chakram lO yennO kashTamulakOrchi kanneeTini digamringi tyAgAlaku venukADaka
biDda SrEyassu kOsam pratinityam (prArthinchE) SramimchE pratyaksha daivam
-mAtRdEvatA mUrti

****
O nEstamA!
maruvaku yennaDU
mAtRdEvObhava anu AryOktini.
ninnu kanna tallini bharatamAta nu
prEmAmRta sammiLita kamalamulatO sadA pUjimchu tarimchu.


jai Hind!

-lsnbsquare-motherindia

****



****





****

* In chemistry, IUPAC (nomenclature) is a standard;
In life's chemistry, mother's love is standard.

* The LOVE-bond
-sweeter than the sweetest
-stronger than the strongest

- jai motherindia

No comments:

Post a Comment